ఓల్వో బస్సు బోల్తా పడింది

 

పాలెం బస్సు దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఓల్వో బస్సు పేరు చెబితేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఓల్వో బస్సుల డిజైన్‌లోనే లోపం వుందని విమర్శలు వచ్చినప్పటికీ, ఓల్వో సంస్థ మాత్రం తాము రూపొందించే బస్సులు భేషుగ్గా వున్నాయని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంది. ఇదిలా వుంటే ఇప్పుడు మరో ఓల్వో బస్సు ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారి మీద శుక్రవారం రాత్రి వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే రామారావు కూడా వున్నారు. డ్రైవర్, క్లీనర్‌తో కలిపి పన్నెండు మందితో హైదరాబాద్ వస్తున్న వోల్వో కొండ్రపోలు దగ్గరకు రాగానే లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.