కమల్ హాసన్ కు ‘విశ్వరూపం’ మూవీ కష్టాలు..!
posted on Jan 7, 2013 8:27AM

కమల్ హాసన్ కు అనేక రూపాల్లో కష్టాలు ముంచుకొస్తున్నాయి. సినిమాను విడుదలకు ముందే డీటీహెచ్ ద్వారా ప్రసారం చేసి, సరికొత్త స్టైల్లో క్యాష్ చేసుకుందామనుకుంటున్నకమల్ కు ఇప్పుడు కరెంటు రూపంలో కష్టాలుముంచుకొస్తున్నాయి. ఇవి ఆయనలో చాలా ఆందోళన రేపుతున్నాయి. కొందరు అగంతకులు కమల్ కు ఫోన్ చేసి చిత్రమైన బెదిరింపు చేశారు. డీటీహెచ్ ద్వారా విశ్వరూపం సినిమాను ప్రసారం చేస్తే ఆ సమయంలో కరెంటు సరఫరా లేకుండా అడ్డుకుంటామంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది కమల్ కు. దీనిపై కమల్ పోలీసులను ఆశ్రయించాడు. కమల్‌హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది.
ఈ నెల 11న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, ముందు రోజు రాత్రి డీటీహెచ్ ద్వారా సినిమాను బుల్లితెరపై వీక్షించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే బెదిరింపు కాల్ కేవలం కమల్ నే కాదు, చాలా మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన రేపుతోంది. వీరు డీటీహెచ్ ద్వారా సినిమా చూద్దామనుకునే సమయానికి తమ ఏరియాలో కరెంటు పోతే! అంతే సంగతులు. ముందుగా డబ్బుచెల్లించి, సినిమా ప్రసారం అయ్యే టైమ్ కు గానీ ఏమైనా ట్రబుల్ ఎదురైతే… సొమ్ము పోగా, సినిమా కూడా అయిపోతుంది!