విశాఖలో కోకైన్ కలకలం

 

విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు థామస్ జియోన్ అనే ఆఫ్రికన్ దేశస్థుడు ఉన్నారు. చేకూరి అక్షయ్ ఏలియాస్ గున్న అనే వ్యక్తితో కలిసి థామస్ జియోన్ ను పోలీసులు విచారించారు వీరి వద్ద 25 గ్రాముల  కోకైన్ లభించింది. 

దీని విలువ మార్కెట్లో 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా ఈ మాదక ద్రవ్యాన్ని  ఢిల్లీ నుంచి ఈ ఆఫ్రికన్ దేశస్థుడు తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది అయితే ఏ రకంగా భారత్ లోకి ఇది  వచ్చిందన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu