ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆంక్షలు..ఎందుకంటే?

 

విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డును ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండచరియల నివారణకు మెష్ ఏర్పాటు తదితరుల మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కనదుర్గ నగర్ మార్గం నుంచి దేవస్థానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఈ మూడు రోజులు పాటు పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కనకదుర్గా నగర్‌ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. ఈ తరుణంలో భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. 

పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu