దయనీయంగా వల్లభనేని వంశీ పరిస్థితి!

గతంలో ఇష్టం వచ్చినట్టు వాగిన వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకి శుక్రవారం నాడు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారు. వంశీ బయటకి రావాలని, గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు సవాళ్ళు విసరాలని డిమాండ్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కుటుంబం ఇంట్లో లేరు. తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంట్లోనే వున్నారనుకుని గొడవ చేశారు. పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడ నుంచి పంపేశారు. నిజానికి కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వల్లభనేని వంశీ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వచ్చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే ఆయన కుటుంబంతో కలసి గన్నవరాన్ని విడిచిపెట్టేసి హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు. 

అధికార మదంతో అప్పట్లో నోటికొచ్చినట్టు వాగారు కానీ, ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చాలా దయనీయంగా వున్నట్టు తెలుస్తోంది. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా అవినీతి, అక్రమాలతో కోట్లు కోట్లు సంపాదించుకున్నారుగానీ, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. చేసిన తప్పు, వాగిన వాగుడు మానసికంగా వేధిస్తూ వుండటంతో అది ఆరోగ్యం మీద ప్రభావం చూపించి మనిషి పూర్తిగా నిస్సత్తువగా అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనే రొప్పుతూ కనిపించారు. నామినేషన్ వేసిన సమయంలో అయితే పూర్తి నిస్సత్తువగా మారిపోయి ఒక బెంచీ మీద కూర్చుండిపోయారు. ఇప్పుడు గన్నవరంలో ఓడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.

వల్లభనేని వంశీ అయితే ఢక్కామొక్కీలు తిన్నవాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని కొంతవరకైనా తట్టుకోగలుగుతున్నారుగానీ, ఆయన కుటుంబం అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు గన్నవరంలో గౌరవంగా బతికి, ఇప్పుడు సొంత ఊరిని, ఇంటిని వదిలేసి హైదరాబాద్‌లో వుండాల్సి రావడం, వంశీ ఆరోగ్యం బాగాలేకపోవడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వుండటం చూసి వాళ్ళు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా చేసి చంద్రబాబు, భువనేశ్వరి కాళ్ళ మీద పడి అయినా ఇప్పుడున్న పరిస్థితిని మార్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తనకు ఆ అవకాశం లేదని వంశీ కుటుంబ సభ్యులకు చెబుతున్నట్టు సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News