రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్
posted on Sep 12, 2015 3:54PM
.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి పూనుకున్న ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అయినా అధికార ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. కేసీఆర్ రైతులపై వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని.. రైతుల గోడు పట్టించుకోకుండా ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను లెక్కచేయకుండా.. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తీరుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతారని ఎద్దేవ చేశారు.