ఉత్తరాఖండ్ బలపరీక్ష ఫలితాలు నేడే..

 

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిన్న హరీష్ రావత్ కు బలపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఫలితాలు మాత్రం సుప్రీం నేడు ప్రకటించనుంది. మొత్తం 62 మంది శాసనసభ్యుల్లో 33 మంది సభ్యులు రావత్ కు ఓటు వేశారు. బీఎస్పీ కూడా రావత్ కు మద్దతు తెలుపడంతో దాదాపు ఆయన పరీక్ష నెగ్గినట్టే. ఇక బీజేపీ కూడా తన ఓటమిని అంగీకరించింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి జంప్ అయి అనర్హత పడిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించలేదు సుప్రీం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu