కాంగ్రెస్ ఎస్పీ షాక్...రంగంలోకి ప్రియాంక గాంధీ..
posted on Jan 21, 2017 11:05AM

నిన్న మొన్నటి వరకూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కొడుకు సీఎం అఖిలేశ్ యాదవ్ ల మధ్య పోరుతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడి వేడిగా సాగాయి. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పడింది అనుకునేలోపు మరో అంశం తెరపైకి వచ్చింది. అదే ఎస్పీ-కాంగ్రెస్ పార్టీల పొత్తు. ఈ రెండు పార్టీల పొత్తు రోజుకో మలుపు తిరుగుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎస్పీ చేసిన పనికి రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేంటంటే.. 210 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించడం.. అంతేకాదు అమేథీ, రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించడంతో, కాంగ్రెస్ షాక్ అయింది. దీంతో ఇంకా పొత్తు ఖరారు కాకముందే జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీకి గుబులు పట్టుకుంది. దీంతో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా గాంధీ ఏకంగా 11 మెసేజ్‌లు పెట్టినా, అఖిలేష్ నుంచి వాటికి సమాధానం వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో అసలు మహాకూటమి విషయం పక్కన పెడితే మామూలు పొత్తులు కూడా అయోమయంలోనే పడ్డాయి. అవసరమైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూద్దాం..కాంగ్రెస్ తో ఎస్పీ పొత్తుకు సై అంటుందో లేదో..