కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్మృతి ఇరానీ సూచించారు.

 

మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. కొత్తగా 43,893 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. కరోనాతో మరో 508 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,20,010 కి చేరింది. ప్రస్తుతం 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu