ఇస్రో మాజీ ఛైర్మన్‌ మృతి..


ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఉడిపి రామచంద్రారావు తుదిశ్వాస విడిచారు. 1932 మార్చి 10 కర్ణాటకలోని అడమారులో జన్మించిన రామచంద్రారావు భారత తొలి వాహన నౌక ఆర్యభట్ట రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.  పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఇన్‌శాట్‌ వాహక నౌకల అభివృద్ధిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. 1976 లో పద్మ భూషణ్, 2017 లో పద్మ విభూషణ్ అందుకున్నారు. అంతేకాదు నాసా, రష్యా సహా పలు దేశాల నుండి అవార్డులు అందుకున్నారు.  బెంగళూరు, అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబోరేటరీ పాలకమండలి ఛైర్మన్‌గా, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ ఛాన్స్‌లర్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu