టిఫిన్ బాక్స్ బాంబుల కలకలం

 

 

 

ఛత్తీస్‌ఘడ్‌లో మూడు పార్లమెంటు సీట్లకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాన్కర్ జిల్లాలో శోధన నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి భారీగా మందుగుండు కూరిన రెండు టిఫిన్ బాక్స్ లు కనిపించాయి. రెండు బాంబులు కలపి పది కిలోల బరువు కలిగి వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వీర్యం చేశారు.

 

ఎన్నికల సందర్భంగా విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్సు బాంబులను ఏర్పాడు చేశారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో కొంతమంది మావోయిస్టులు మరణించారు. దానికి ప్రతీకారంగా మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్స్ బాంబులు ఏర్పాటు చేసి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.



టిఫిన్ బాక్స్ బాంబులు లభించడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని పౌరులకు సూచించారు. టిఫిన్ బాక్స్ బాంబులు పోలీసులకు దొరికాయన్న వార్త ఛత్తీస్‌ఘడ్‌లో సంచలనం సృష్టించింది.