హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్.. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి

 

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TS 07 EB 3680 నెంబరు కారు పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 221 ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన స్టూడెంట్స్ ఉదయశంకర్, తరుణ్ గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. కారు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వాళ్లు మాదాపూర్ లో ప్రైవేట్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి రాజేంద్ర నగర్ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అతివేగంగా నడపడం వల్లే కారు నుజ్జు నుజ్జు అయ్యిందని.. ఆ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణం ఏంటి..ఆ కారు ఎవరిది.. అనే విషయం మీద ఆరా తీస్తున్నారు.

మొత్తం 9 మంది విద్యార్థుల్లో గణేష్ అనే విద్యార్థి రాత్రి 9:30కు క్యాంపస్ నుండి బయటకు వచ్చాడు. అక్కడి నుండి నేరుగా కోంపల్లిలో ఉన్న తాత ఇంటికి వెళ్లాడు. గణేష్ తాత టాటా సఫారీ వాహనాన్ని తీసుకొని శంషాబాద్ ఏయిర్ పోర్టు వైపు రావడం జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ 9 మంది విద్యార్థులు  ప్రీప్లాన్డ్ గా ఇక్కడకు వచ్చి పార్టీ చేసుకొని ఉదయం 5 గంటల లోపే హాస్టల్ కి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో 2 గంటల ప్రాంతంలో పార్టీ ముగించుకున్నారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణమై ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదంలో ముందు కూర్చున్న ఉదయ్ శంకర్, తరుణ్ ఇద్దరూ కూడా స్పార్ట్ లోనే చనిపోయారు. డ్రైవర్ వెనుకాల కూర్చున్న శశాంఖ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని స్థానికంగా  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న మిగతా ఆరుగురుకి కేవలం స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి వాళ్ళంత అక్కడ నుంచి పరారైపోయారు. అయితే వీరంతా మద్యం సేవించి ఉన్నారా లేరా అనేటువంటి కోణంలో  ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది.