TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

20 మంది టీఆర్ఎస్ నేతలు టీడీపీలోకి....

Published on: Sat Apr 29, 2017 11:12AM


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకే జంపింగ్  లు జరిగాయి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నుండి నేతలు టీడీపీలోకి జంప్ అయ్యారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 20 మంది టీఆర్ఎస్ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. నిన్న తాండురులో టీడీపీ ఆధ్వర్యంలో  ప్రజాపోరు బహిరంగసభ జరగగా దానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పరిగికి చెందిన 20 మంది టీఆర్ఎస్ నేతలు, ఇంకా  కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ వైఖరిపై నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే పార్టీ మారుతున్నారని..  కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు.