ట్రిపుల్ తలాఖ్ పై తీర్పు... రిజర్వ్ లో పెట్టిన సుప్రీంకోర్టు...

 

ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. గత కొద్ది కాలంగా ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆరు రోజుల పాటు ముమ్మరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాఖ్ కేసుపై తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది.  ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని..సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలు వినిపించారు. ఇక దీనికిగాను ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ వాదనను షయారా బానో న్యాయవాది తిప్పికొట్టారు. ఇలా ఈరోజు వాదనలు ముగిశాయి. వాదనలు మొత్తం విన్న సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ట్రిపుల్ తలాఖ్ ఉంటుందా.. ఉండదా అనే విషయం తేలనుంది. నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.