అనంతపురంలో రైలు ప్రమాదంలో 16మంది మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వే స్టేషనులో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారు జామును ఆగి ఉన్న గూడ్స్ రైలును హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ప్రమాదంలో 300 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 50 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.మరణించినవారిలో రైలు డ్రైవర్‌తో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు.


 

గూడ్స్ రైలు ఆగి ఉన్న పట్టాలపైకే హంపీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 18 మందిని రక్షించినట్లు జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ చెప్పారు. అనంతపురం జిల్లాలో ఉన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మంత్రి రఘువీరా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu