మూసీనదిలో టోర్నడో

ఆకాశానికి ఎగిసిన నదీ జలాలు

టోర్నడోలు ఎక్కువగా అమెరికాలో సంభవిస్తుంటాయి. అయితే ఇప్పుడు మన దగ్గర టోర్నడోలు కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని యానాంలో రొయ్యల చెరువులమీద ఏర్పడిన భీకరమైన గాలులు సుడులు తిరుగుతూ టోర్నడో గా మారింది. చెరువులోని నీటితో పాటు రొయ్యలు, ఒడ్డున ఉన్న వలలు కూడా గాలిలోకి లేచి పెద్ద బీభత్సం సృష్టించింది. అంతకు ముందు భైరవపాలెంలోని సముద్రంలోనూ టోర్నడో ఏర్పడింది. సముద్రంలోని నీరు సుడులు తిరుగుతూ పైకి ఎగిసి ఆకాశానికి ఎదురెళ్లటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రలో సంభవించిన ఈ ప్రకృతి భీభత్సం తాజాగా తెలంగాణలోని మూసీ నది సమీపంలో ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీనది జలాలు భూమ్మీద నుంచి ఆకాశానికి  సుడులు తిరుగుతూ పైకెగిశాయి. పెద్దఎత్తున సంభవించిన ఈ టోర్నడో పరిసర ప్రాంతాల ప్రజలను దిభ్రాంతికి గురిచేసింది. దీనిని వీడియోలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కాసేపట్లోనే వైరల్ అయింది.