ఇప్పటికే రుద్రమదేవి సినిమాని పూర్తి చేయడానికి గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. మొదటి నుండి ఈ సినిమాకు పాపం ఎదురుదెబ్బలు బాగానే తగిలాయి. అయినా ఏదోలా సినిమా మాత్రం పూర్తిచేశాడు. అయితే ఇప్పుడు ఈయనకు మరో సమస్య వచ్చిపడింది. అది ఎవరి వల్లో కాదు ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర పోషించిన నటి అందాల భామ అనుష్కవల్లనట. అదెలా అంటే రుద్రమదేవి రిలీజ్ నేపథ్యంలో భాగంగా గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టాడు. అయితే ఈ ప్రమోషన్లపై అనుష్క అంత ఇంట్రస్ట్ చూపించట్లేదట. తన దృష్టంతా తన కొత్త సినిమా సైజ్ జీరో పై ఉందని.. ఈ ప్రమోషన్లపై అస్సలు దృష్టి నిలపడం లేదని టాక్. అయితే గుణశేఖర్ ఎలాగో కూర్చోపెట్టి ఇంటర్య్వూలు ఇప్పిస్తున్నాకాని సినిమా గురించి కాన్ఫిడెన్స్‌గా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదట. టీవీ ఛానళ్ల లైవ్ పోగ్రాంకి రమ్మంటే ససేమీరా అంటోందట. అయితే అనుష్క మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి చాలా రోజులు కేటాయించాను ఇక నావల్ల కాదు అని తేల్చి చెప్పేసిందట.