బాబు తిరుపతి ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు... ఏం జరగనుంది?

ఏపీ రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతోంది.జగన్ నిర్ణయం పై ఒకొక్క నేత ఒక్కోలా స్పందిస్తున్నారు .ఏపీ రాజధానిని తరలించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం పై రైతుల నిరసన లు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి దాకా క్యాండిల్ ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రోడ్డు పై బైఠాయింపులతో తమ నిరసన తెలిపిన రైతలు ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.ఇవాళ ఉదయం ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, రైతులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మందడం నుంచి విజయవాడ లోని గుణదల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.టిడిపి అధినేత చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం.ఉదయం పది గంటలకు జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

సాయంత్రం నాలుగు గంటలకు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు జరిగే ర్యాలీకి కూడా చంద్రబాబు హాజరవుతారు. అయితే తిరుపతి పోలీసులు మాత్రం శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే అమరావతి పరిరక్షణ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. సంక్రాంత్రి హడావిడి ఉందని.. కాబట్టి ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎవరైనా ర్యాలీకి ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నగరంలో పోలీసుల్ని భారీగా మోహరించారు.. పరిస్థితి ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో బాబు ఏం చేయబోతున్నారన్నది చర్చనీయంశంగా మారింది.