శ్రీవారి భక్తులకు శుభవార్త ..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు

 

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను  టీటీడీ ఉచితంగా నడపనుంది. ఈ వాహనాలలో తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు భక్తులను ఎలక్ట్రిక్ వాహనాలలో తీసుకెళ్లాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేసవి ఎండలలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమలలో అనేక రకాల ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటి సదుపాయం, వైద్య సదుపాయం, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. 

దీంతో ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీటీడీ  ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే తిరుమల ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu