టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే:

తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల వివరాలను ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందులో భాగంగా రెండు మార్పులతో 17 మంది సభ్యులతో ..పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి సీతక్క, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు స్థానం కల్పించారు..జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణరావు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని సీఎం అన్నారు. తెలంగాణ కమిటీకి ఎల్.రమణ అధ్యక్షుడిగా..రేవంత్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటారని వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ కమిటీకి కళా వెంకట్రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని..త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీలు ప్రకటించనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు.