తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి
posted on Sep 19, 2014 11:20AM
.jpg)
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి వున్నాయని, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు చాలా వెనుకబడి వున్నాయని కేసీఆర్ చెప్పారు. అందువల్ల తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్ర స్థానంలో వుందని కేసీఆర్ ఈ సందర్భంగా 14వ ఆర్థిక సంఘానికి చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాల వివరాలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.