ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు చెప్పారు?

 

ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై సర్వీసు ప్రొవైడర్లను కాల్ డేటా ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఏపీ అధికారులు కాల్ డేటా ఇవ్వాలనం సబబుకాదని వాదించారు. కాని హైకోర్టు మాత్రం కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని.. వారితో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పింది. దీంతో ఎట్టకేలకు సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు కాల్ డేటాను సమర్పించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశామని పత్యక్షంగా చెపుతున్నా మాత్రం చర్యలు తీసుకునేవాళ్లు మాత్రం లేరు. అయితే గతంలో ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీ అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారని లాయర్ల జెఏసి జూన్ 28న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశాల ఆధారంగా పోలీసులు టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నేర పరిశోధన విభాగం పోలీసు అధికారులు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు ఇలా ట్యాపింగ్ చేయాలంటూ ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. కానీ తమ ఫిర్యాదులో సర్వీస్ ప్రొవైడర్లు, కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటూ ప్రస్తావించారని, ప్రజాప్రతినిధుల పేర్లు లేకపోవడంతో దర్యాఫ్తు ఆలస్యమవుతుందని సిసిఎస్ అధికారులు చెబుతున్నారు.