6,7,8.. బడి గంట మోగిందోచ్..
posted on Feb 23, 2021 4:12PM
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనాతో మూత పడిన స్కూళ్లు, కాలేజీలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ కాలేజీలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9,10వ తరగతి విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్తున్నారు. తాజాగా 6 నుంచి 8వ తరగతులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 6 నుంచి 8వ తరగతి క్లాసులను ఫిబ్రవరి 24, బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
మార్చి 1లోపు పూర్తిస్థాయిలో పాఠశాలల్లోనే బోధన జరుగుతుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయితే, పిల్లలను స్కూల్ కు పంపడం, పంపించకపోవడాన్ని తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేసింది. అందరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. మాస్కులు, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని విద్యాశాఖ స్పష్టంచేసింది.