కేసీఆర్ ఖాతాలో మరో సమస్య



 

ఇప్పటికే రైతుల ఆత్మహత్యలతో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అందరూ. దీనికి తోడు మళ్లీ ఇప్పుడు వేరే అంశం ఒకటి కేసీఆర్ ఖాతాలో చేరింది. వేతనాల పెంపుదలపై ఆశావర్కర్లు ఛలో అసెంబ్లీని చేపట్టిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడి వారిని అక్కడే అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులకు, వర్కర్లకు మధ్య తోపులాటలు జరగాయి. ఈ తోపులాటలో కొంతమంది వర్కర్లకు గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల మంది వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు.  సచివాలయం ముట్టడికి జిల్లాల్లో ఆందోళనలకు ప్రయత్నించిన 8805 మందిని అరెస్టు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ స్వయంగా ప్రకటించడమే దీనికి నిదర్శనం.

ఇదిలా ఉండగా రైతు సమస్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఈరోజు బంద్ కూడా నిర్వహించారు. దీనితో పాటు ఇప్పుడు ఈ అంశం పై కూడా అధికార పార్టీపై ఆందోళనకు దిగడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇంతా జరుగుతున్న కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్టు వ్యవహరించడం.