సికాసను కలవరపెడుతున్న జనశక్తి
posted on Mar 31, 2012 7:22AM
తెలంగాణలో బొగ్గుగనుల ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య ఎదురులేని శక్తిగా ఉంది. అయితే ఇప్పుడు సిపీఐఎంఎల్ జనశక్తి సింగరేణి కార్మిక సమాఖ్యకు సవాలు విసిరింది. ఇటీవల సిపీఐఎంఎల్ జనశక్తి జిల్లా కార్యదర్శి ప్రకాష్ పేరిట విడుదలైన ఒక పత్రికా ప్రకటనలో సికాస నాయకుల వ్యవహారశైలిని విమర్శించారు. సికాస జెబిసిసిఐలో సభ్యత్వం ఉందని విర్రవీగుతూ కార్మికుల పొట్టలు కొడుతోందని ప్రకాష్ తన ప్రకటనలో విమర్శించారు. కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని సిఎంపిఎఫ్ పై 10శాతం వడ్డీ చెల్లించాలని, కోడాఫ్ డిసిప్లిన్ మార్చిన తరువాత ఎన్నికాలు జరపాలని ప్రకాష్ తన లేఖలో డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జనశక్తి పేరిట ఇటువంటి లేఖ రావడం సింగరేణి కార్మిక సమాఖ్య నాయకులను కలవరపెడుతోంది. కార్మికవర్గ పోరాటంలో దశాబ్దకాలానికి పైగా చరిత్ర కలిగి ఉన్న సికాస మొదటినుంచి కార్మికుల సమస్యలపై పోరాడుతుండగా ఎన్నికలకు ముందు జనశక్తి రంగంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.