నేడు హైకోర్ట్ తీర్పు పై ఆధారపడ్ద రేపటి తెలంగాణ బంద్...

 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది. రోజురోజుకు తమ ఆందోళనలు పెంచుతున్నారు కార్మికులు.ఆర్టీసి జెఎసి నేతలైన కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర జెఎసి నేతలను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. రేపటి తెలంగాణ బంద్ నేపథ్యంలో హైకోర్టుకు బయల్దేరిన ఆర్టీసి జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

ఆర్టీసీ సమ్మె నేపధ్యంలోనే రేపు తెలంగాణ బంద్ కు పిలునిచ్చింది జేఏసీ. బంద్ కు తాము సైతం సై అంటున్నారు ఉద్యోగ కార్మిక సంఘాలు. మరోవైపు విద్యార్ధి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఇవాళ హై కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు బంద్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. తెలంగాణ బంద్ కు అఖిల పక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అయితే ఇవాల్టి కోర్టు విచారణలో ఏం తేలుతుందన్న టెన్షన్ నెలకొంది. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని గతంలో అభిప్రాయ పడిన కోర్టు, ప్రభుత్వం కార్మిక సంఘాలు చర్చించుకుని పధ్ధెనిమిదివ తేదీన సారాంశాన్ని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అయితే కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధమని చెబుతున్నా అలాంటి ప్రసక్తే లేదంటున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్.మరి కోర్టు విచారణలో ఏం తెలబోతుంది. రేపు బంద్ ఉంటుందా ఆగుతుందా లేదా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.