అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

 

తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చింది. తెరాస పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు పట్టబట్టింది. ఈ డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి మంగళవారం సభ నుంచి శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మినహా పదమూడు మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. సస్పెండ్ అయిన సభ్యులు.... 1. జీవన్ రెడ్డి, 2. డీకె అరుణ, 3. మల్లు భట్టి విక్రమార్క, 4. సంపత్ కుమార్, 5. కోమటిరెడ్డి వెంకటరెడ్డి , 6. గీతారెడ్డి, 7, పువ్వాడ అజయ్ కుమార్, 8. ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9. పద్మావతి రెడ్డి, 10. భాస్కరరావు , 11. రాంరెడ్డి వెంకటరెడ్డి , 12. కృష్ణారెడ్డి , 13. రామ్మోహన్ రెడ్డి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu