ప్రారంభమయిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 2700 పోస్టులకు ఆమోదం
posted on Mar 12, 2016 9:29AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కరువు, రైతు సమస్యలపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో వేలాది పోస్టులు ఖాళీలున్నాయి.. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దీనికి ఈటెల రాజేందర్ స్పందించి.. ఏడాది లోపు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం.. 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. కార్పోరేషన్లలో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.. ఉద్యోగాల భర్తీని డబ్బుల కోణంలో ప్రభుత్వం చూడటం లేదు.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 2700 పోస్టులకు ఆమోదం తెలిపాం అని అన్నారు.