కోపంలో టీడీపీ ఎంపీలు... రంగంలోకి దిగిన మోడీ...

 

ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి అందరూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు. సామాన్య ప్రజలు ప్రతిఒక్కరూ బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై  తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక దీనిలో భాగంగానే మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీ మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో తన నిరసనలు మొదలుపెట్టారు.దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం సత్ఫలితాలివ్వకపోవడంతో పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ఎంపీలు స్పష్టం చేశారు. ఇక వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు స్వయంగా మోడీనే రంగలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పీఎంవో నుంచి టీడీపీ నేతలకు ఆహ్వానం వెళ్లిందట. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మరో నలుగురు ఎంపీలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దీంతో ఈ సమావేశంలో మోడీ ఏం చెప్పి బుజ్జగిస్తారబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.