మరోసారి చంద్రబాబుపై శివప్రసాద్..నిందలు మోపుతున్నారు.
posted on Apr 16, 2017 1:34PM

టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంబేద్కర్ జయంతి రోజున దళితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయన చంద్రబాబునాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన శివప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందునే చంద్రబాబునాయుడు తనపై నిందలు మోపుతున్నారని..తమవారికి న్యాయం చేయాలని అడగటమే తప్పై పోయిందని.. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదెందుకని ప్రశ్నించడం, డీకేటీ భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని అడగటం తోనే తనపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.