అంతా ఆల్‌ రైట్ - జేసీ

ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. అవిశ్వాసం పై చర్చకు తాను వెళ్ళేది లేదు అని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వ్యవహారం గురించి చంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో చర్చించారు.అనంతరం అనంతపురంలో రహదారుల విస్తరణకు 45 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయటమో లేక చంద్రబాబు సముదాయించటం వల్లనో మొత్తానికి సమావేశాలకు హాజరయ్యారు.అవిశ్వాసంపై చర్చ అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మీడియా సమావేశం పెట్టింది అందరికి విదితమే.

 

 

 

ఆ సందర్భంలో జేసీని కలవాలని సూచించారు.అయితే ఈ రోజు ఉండవల్లిలో సీఎంని ఇంటివద్ద కలవాలని వెళ్లారు.కానీ అప్పటికే వేరే సమావేశంలో ఉండడంతో సచివాలయానికి రావాల్సిందిగా సీఎం కార్యాలయ సిబ్బంది సూచించారు. దీంతో సచివాలయానికి వెళ్లిన జేసీ దాదాపు 20నిమిషాల పాటు చంద్రబాబుతో చర్చించారు.చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. ఇప్పుడు అంతా ఆల్‌ రైట్’’ అని అన్నారు.తాను ఎవరి మీదో అలిగి పార్లమెంటుకు వెళ్లలేదనేది నిజం కాదని దివాకర్‌రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి అంతా వివరించానని, అయితే ఆయనతో ఏం మాట్లాడాననే విషయాన్ని బయటకు చెప్పనన్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగాలేదని,రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనన్న జేసీ,అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడేం చేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.