టిడిపి అడ్రస్ గల్లంతు కావడం ఖాయ౦: కెసిఆర్

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక ఎవరూ అడ్డుకోలేరని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన అన్నారు.

 

టీడీపీ జుక్కల్ ఎమ్మెల్యే షిండే వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి వచ్చారంటే, ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చనని అన్నారు.   తెలంగాణ టీడీపీ నేతలు కూడా షిండే బాటలో ఉద్యమంలోకి రావాలి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మాతృ ద్రోహులుగా మారకుండా తెలంగాణ ప్రజల్లో గౌరవం పెంచుకోవాలని కేసీఆర్ హితవు పలికారు.



ఏనుగు వెళ్లింది.. తోక చిక్కిందంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అభివర్ణించారు. బీహార్‌లోనూ లాలూప్రసాద్ పార్టీ బలంగా ఉండేది. బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయాక ఆ ప్రాంతంలో లాలూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. ఇదేందని అక్కడి ప్రజలను అడిగితే.. 'లాలూ పార్టీది, మాది వేర్వేరు రాష్ట్రాలు' అని బదులిచ్చారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే'' అని చెప్పారు.