కిటికీలకు 80 లక్షలా!.. బంగారంతో చేపిస్తున్నారా?.. జగన్ పై ప్రశ్నల వర్షం

 

వ్యవసాయ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా. కోటి మంది రైతులుంటే 40 లక్షల మందికే భరోసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆదా చేస్తున్నామని చెప్పుకునే వైసిపి జగన్ ఇంటి కిటికీలకు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. గతంలో కోటి మంది రైతులున్నారు. ఇవాళ కనీసం నలభై లక్షల మంది రైతులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. అంతే కాకుండా కౌలు రైతులకి మేం భరోసా అన్నారు.. ఇవాళ కౌలు రైతులను గుర్తించే విషయంలోనే మీరు విఫలమైతే మీరు వారికి ఏం న్యాయం చేయగలుగుతారు.

బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మీరు ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేత పత్రం ఎక్కడైనా రిలీజ్ చేశారా..? రైతు భరోసా అని చెప్పి చాలా గొప్పగా ఈనాడు చెప్పుకుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు మీరు రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పబ్లిసిటీ పేరుతో దుర్వినియోగం చేశారు. ఇందులో ఏమి ఆదా చేస్తున్నారు. మేము రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేస్తామన్నారు ఏ రకమైన ఆదా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల రంగు మార్చినందుకు రూ.1100  కోట్ల రూపాయల ఖర్చయ్యింది. ఆఖరికి మీరు కట్టుకున్న ఇంటికి రూ.20 కోట్ల రూపాయల ఖర్చెందుకు పెడతారన్నారు. బాత్ రూము టాయిలెట్స్ కి 10 లక్షల రూపాయలు.. కిటికీలకూ 80 లక్షల రూపాయలు ఏమి వెండితో చేయిస్తున్నారా కిటికీలూ లేద బంగారంతో చేపిస్తున్నారా. మీ ఇంటికి రోడ్డు వేయటానికి రూ.5 కోట్ల రూపాయలా ఏమిటిది..? ప్రజాధనం అని మర్చిపోకండి అంటూ జగన్ ప్రభుత్వ నిర్వాకంపై మండి పడ్డారు.