అమ్మ మరణం తర్వాత తొలి కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు

 

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. ఇక జయ కన్ను మూసిన తరువాత ప‌న్నీర్ సెల్వం అధ్యక్ష‌త‌న ఈ రోజు మొద‌టిసారిగా రాష్ట్ర‌ కేబినెట్ భేటీ జ‌రిగింది. సమావేశానికి ముందు జ‌యల‌లిత స‌మాధివద్ద ప‌న్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో కేటినేట్ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అవి.

* జ‌య‌ల‌లిత పేరిట మెరీనా బీచ్ వ‌ద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
* జ‌య‌ల‌లిత రాష్ట్రంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను నిర్విఘ్నంగా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.
* జ‌య‌ల‌లిత స్మార‌క విగ్ర‌హాల ఏర్పాటు చేయాలని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది.