పాకిస్థాన్ టీమ్ కు మోడల్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తా..
posted on Mar 15, 2016 5:30PM

భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తారు. ఇదంతా ఒకఎత్తైతే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు ఓ మోడల్ ఓ ప్రకటన చేసింది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ను పాక్ జట్టు ఓడిస్తే, యావత్ పాక్ ప్రజల ముందు 'స్ట్రిప్ డ్యాన్స్' చేస్తానంటూ పాకిస్థాన్‌కు చెందిన మోడల్ కాందీల్ ప్రకటించింది. కాగా గతంలో పూనమ్ పాండే కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2011లో భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ ఈ భామ అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.