గుర్తు పట్టలేని విధంగా శ్వేతాబసు ప్రసాద్

 

హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ పూర్తిగా మనం గుర్తు పట్టలేని విధంగా గెటప్ మార్చేసింది. ఇటీవల తన జీవితంలో చిన్న కుదుపు వచ్చిన అనంతరం ఆమె తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసింది. కెరీర్‌లో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె గెటప్ కూడా పూర్తిగా మార్చేసింది. గురువారం నాడు హైదరాబాద్‌కి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఎవరూ గుర్తుపట్టలేని విధంగా స్లిమ్ అయి కనిపించింది. ముఖంలో పాత ఫీచర్లు కూడా బాగా తక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త శ్వేతా బసు ప్రసాద్‌లా కనిస్తోంది. శ్వేతా బసు ప్రసాద్‌ ముఖంలో బాగా మార్పు వచ్చింది. ఈ మంచి మార్పు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News