కంచ గచ్చిబౌలి భూములపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
posted on Jul 23, 2025 2:51PM
.webp)
కంచ గచ్చిబౌలి భూములపై సుఫ్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కి తేదీకి వాయిదా పడింది. ఆ భూముల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నాట్లు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరగా, న్యాయస్థానం వాయిదా వేసింది.
నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించింది. లేదంటే అధికారులను జైలుకు పంపిస్తామని మరోమారు హెచ్చరించింది. ఈ మేరకు హెచ్ సీయూ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఈ భూమిలో పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ సర్కార్ మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను ధర్మాసనం పరిశీలించింది.
గత విచారణలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించడానికి సమయం కావాలని అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.