కేసీఆర్ కు అభినంద‌న‌లు తెలిపిన సూప‌ర్ స్టార్!!

తెలంగాణ‌లో ఘ‌న విజ‌యం సాధించిన టిఆర్ఎస్ పార్టీకి సినీ తారల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌ర్వేల అంచ‌నాల‌ను కూడా త‌ల‌కిందులు చేస్తూ ఘ‌న విజ‌యం సాధించ‌టంతో హీరోలు.. టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్, కేటీఆర్ ల‌ను అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు సినీ సెల‌బ్ర‌టీస్.

 

 

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ కేసీఆర్ గారికి హృద‌య పూర్వ‌క విజ‌యాభినంద‌న‌లు అంటూ ఓ ప్ర‌క‌టన కూడా విడుద‌ల చేశారు. నాలుగున్న‌రేళ్ల పాటు  ప‌రిపాల‌న త‌ర్వాత ఇంత అత్య‌ధిక స్థానాల‌లో విజ‌యం సాధించి మ‌ళ్లీ అధికారంలోకి రావ‌టం చాలా గొప్ప విష‌యం. కేసీఆర్ గారు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌న్నీ ప్ర‌జ‌ల‌కి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌కి ఈ అఖండ విజ‌యాన్ని అందించారు. మ‌ళ్లీ రెండో సారి తెలంగాణ‌కి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డుతున్న శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రావుగారికి నా  హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు`` అంటూ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. 

అలాగే హీరోలు శ్రీకాంత్ ,సుధీర్ బాబు, నాని, నిఖిల్ , మంచు మ‌నోజ్ ల‌తో పాటు ద‌ర్శ‌కులు హ‌రీష్ శ‌కంర్‌, గోపిచంద్ మ‌లినేని , మెహ‌ర్ ర‌మేష్ , కోన వెంక‌ట్, మ‌ధుర శ్రీధ‌ర్ లాంటి ఎంతో మంది సినీ తార‌లు టిఆర్ ఎస్ పార్టీకి , కేసీఆర్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు.