రజనీకాంత్‌ రాజకీయాలకు సరిపోరు...

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై కూడా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రజనీకాంత్‌ సరిపోరు.. ఆయనకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదు. తమిళనాడులో ప్రస్తుత తరం ఎంతో చదువుకున్న వాళ్లు.. వాళ్లందరూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. అందుకే ఆయన సీఎంగా సరిపోరు’ అని స్వామి విమర్శించారు. దీంతో ఇప్పుడు స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి తమ అభిమాన సూపర్‌స్టార్‌ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులు స్వామి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూద్దాం..