సుబ్బిరామిరెడ్డి చరిత్ర చెప్పిన దగ్గుబాటి

 

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేయాలని పరితపిస్తున్నారు. అయితే సిట్టింగ్ యంపీ పురందేశ్వరి కూడ అక్కడి నుండే పోటీ చేయాలను కావడంతో సమస్య మొదలయింది. నాటి నుండి ఆమెకు పొగపెట్టే పనిలో పడ్డారు రెడ్డి గారు.

 

ఆమెకు ఆ సీటు పొందానికి తానూ ఏవిధంగా సహాయం చేసింది వివరిస్తూ, ఇప్పుడ తానూ పోటీ చేయాలను కొంటున్నందున ఆమె విశాఖ నుండి తప్పుకొని, నరసరావు పేట నుండి పోటీ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. సిటింగ్ యంపీకే టికెట్ ఇవ్వాలని రూలేమీ లేదని మరో లాజిక్ పాయింటు కూడా చెప్పారు. ఇటీవలే సోనియా గాంధీని కలిసి, విశాఖ లో తానూ చేస్తున్న సేవా కార్యక్రమాల లిస్టు వివరించి తనకే విశాఖ టికెట్ ఇవ్వాలని నచ్చజెప్పి వచ్చారు. దానితో ఆమె తనకు హామీ ఇచ్చినట్లే భావించిన ఆయన టికెట్ పై వంద శాతం ఉండే తన నమ్మకం కాస్తా 1000 శాతానికి పెరిగినట్లు ఆయనే చాటింపు వేసుకొన్నారు. పనిలో పనిగా మళ్ళీ మరోసారి పురందేశ్వరికి నరసరావు పేటకు వెళ్ళిపొమ్మని చెప్పారు.

 

అయితే, పురందేశ్వరి మాత్రం అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపుచ్చేసారు.

 

కానీ రాన్రాను పెరుగుతున్న రెడ్డి గారి ఒత్తిడి భరించడం మాత్రం కష్టంగానే ఉండటంతో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రంగంలో దిగక తప్పలేదు. ఆయన పీసీసీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ ‘సుబ్బిరామి రెడ్డి ‘80ల్లో నాగర్జున్ సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు చేస్తూ బ్లాకులో సిమెంట్ అమ్ముకొంటున్నపటి నుండి ఏవిధంగా పైకి వచ్చిందీ నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి వద్దకు మేమేనాడు సహాయం కోసం వెళ్లలేదు. పైగా ఆయనే నా భార్యకి టికెట్ ఇవ్వొదంటూ హైకమండుకి లేఖ వ్రాసినట్లు కూడా మాకు తెలుసు. అయినా మేము అవన్నీపట్టించుకోలేదు. ఎందుకంటే హైకమండుకి ఎవరు ఎటువంటి వారో ఎవరికీ టికెట్ ఈయాలో బాగా తెలుసు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఇతరులకి ఈ విధంగా ఉచిత సలహాలు ఇచ్చినపుడే సమస్య వస్తుంది, ”అని చురకలు వేసారు.

 

మరి శివ భక్తుడయిన రెడ్డిగారు ఇప్పుడు దగ్గుబాటి ఆరోపణలకు ఏవిధంగా శివ తాండవం చేస్తారొ చూడాలి.