బ్రిస్బేన్ వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు, 74 ఆలౌట్

 

 

Sri Lanka beat Australia, Sri Lanka beat Australia by four wickets, Australia humiliated by Sri Lanka in third ODI after posting just 74

 

 

బ్రిస్పేన్ లో శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కి క్యూకట్టారు. ఆస్ట్రేలియా ఒక సందర్భంలో 40 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే, మిచెల్ స్టార్క్, జేవియర్ దొహర్తీ 8.1 ఓవర్లలో 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాస్తా ఊరట కల్పించారు. శ్రీలంక బౌలర్లు నువాన్ కులశేఖర (5/22), లసిత్ మలింగ (3/14) కంగారూలకు చుక్కలు చూపించారు.


శ్రీలంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా 74 పరుగులకే పరిమితమైంది. 1986 తర్వాత ఆస్ట్రేలియా ఇంత దారుణమైన స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. శ్రీలంక 75 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చేదించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, శ్రీలంక చెరో మ్యాచులో విజయం సాధించాయి. దీంతో సిరీస్ 1-1 స్కోరుతో సమంగా ఉంది.