స్పీడ్ న్యూస్ 2

కృష్ణాలో పాఠశాలలకు సెలవులు

11. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థలకు ఈ రోజు సెలవుదినంగా ప్రకటించారు.

........................................................................................................................................................

పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న యువకుడి అరెస్ట్

12. చిన్నారుల పోర్న్ వీడియా లను  షేర్  చేస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.  అమెరికా దర్యాప్తు సంస్థ  భారత దౌత్య కార్యాలయానికి ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన ఆ యువకుడిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు.  

.......................................................................................................................................................

భద్రాచలం వద్ద గోదావరి వరద

12.భారీ వర్షాలతో  భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 39.4 అడుగులుగా ఉండగా, పోలవరం వద్ద ఇది 11.4 మీటర్లుగా ఉంది. ఇక ధవళేశ్వరం వద్ద వరద  ఇన్ ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులుగా ఉందని విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు.

............................................................................................................................................................

ఎర్రకాల్వకు పోటెత్తిన వరద

13.  పశ్చిమ ఏజెన్సీ లో  నిన్నటి నుంచీ  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా  ఎర్రకాలువ జలాశయానికి వరద పోటెత్తుతోంది. కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

....................................................................................................................................................

బెజవాడలో విరిగిపడిన కొండ చరియలు

14. విజయవాడ లో  ఒ ఇండిపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడినట్లు చెబుతున్నారు. కొండ దిగువన ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

...................................................................................................................................................

భారత్ బియ్యం ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలి : ఐఎంఎఫ్

15. బియ్యం ఎగుమతులపై ఇండియా  విధించిన బ్యాన్ వల్ల గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ ముప్పు పొంచి ఉందని   ఐఎంఎఫ్  ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో బియ్యం కొరత ఏర్పడిందని పేర్కొంది.  దీంతో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

.................................................................................................................................................

కార్గిల్ అమరులకు చంద్రబాబు నివాళి

16. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి చరిత్రాత్మక విజయాన్ని అందించిన కార్గిల్ యుద్ధ వీరులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు  శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవానులకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.

.......................................................................................................................................................

బీఆర్ఎస్ విఫ్

17. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో  పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా  ఓటు వేయాలంటూ  బీఆర్ఎస్  తమ పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసింది.  

..........................................................................................................................................................

జల్లేరు వాగు ఉధృతి

18.ఏలూరు జిల్లా పట్టెన్నపాలెంలో జల్లేరు ఉధృతి  కారణంగా  సుమారు 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.   మరోవైపు  అల్లూరి సీతారామరాజు జిల్లా భూపతిపాలెం జలాశయం వద్ద కొండచరియలు విరిపడ్డాయి. 

........................................................................................................................................................

కార్గిల్ అమరులకు రాజ్ నాథ్ సింగ్ నివాళి

19.  కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాళులర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని  ద్రాస్‌లో కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద ఆయన అంజలి ఘటించారు.

.........................................................................................................................................................

ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

20. భారీ వర్షాల కారణంగా  ఇల్లెందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్  గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో సైతం నాలుగు ఓపెన్ కాస్ట్  గనుల్లో బొగ్గు ఉత్పత్తి  నిలిచిపోయింది. 

...........................................................................................................................................................

 వర్షాల పరిస్థితిపై మంత్రి సత్యవతి రాథొడ్ సమీక్ష

21. ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లాల్లో  కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం  అప్రమత్తంగా ఉండాలని   మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు ఆదేశించారు . భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా  ఎదుర్కొనేలా   అధికారులు, సిబ్బంది సమన్వయంతో  పని చేయాలన్నారు.

..............................................................................................................................................................

మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద

22. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద  లక్ష్మీ బ్యారేజీకి  ఇన్ ఫ్లో పెరగడంలో  ప్రాజెక్టు 85 గేట్లలో 75 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే  కిందకు వదులుతున్నారు.

....................................................................................................................................................

ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు: గడ్కరీకి ఓబీసీ అసోసియేషన్ వినతి

23. చట్ట సభల్లో  ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలనిఅఖిల భారత ఓబీసీ అసోసియేషన్ కేంద్ర  మంత్రి నితిన్ గడ్కరీని కోరింది. ఢిల్లీలో  జరిగిన  ఓఅవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్కరీకి అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

.......................................................................................................................................................

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు మోడీకి ఆహ్వానం

24. అయోధ్య రామమందిరంలో  వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన  కార్యక్రమానికి ప్రధాని మోడీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. 2024 జనవరి 15 నుంచి 24 వరకు అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

....................................................................................................................................................

1నుంచి నెల రోజులు శ్రీవారి పుష్కరిణి మూత

25. తిరుమలలో వచ్చే నెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూతపడనుంది.  శ్రీ‌వారి పుష్క‌రిణిలో నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు పుష్కరిణిని మూసి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేశస్థానం పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu