కాంగ్రెస్, ఎస్పీ బంధానికి ముగింపు..!

 

ఎలాగైనా సరే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేద్దామని ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ రెండు పార్టీలకు ఝలక్ ఇస్తూ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రెండు పార్టీలు.. తమ బంధాన్ని తెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఓ ప్రకటన చేశారు. లక్నోలో జరిగిన యూపీ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. సమాజ్ వాదీతో పొత్తును తెంచుకుంటున్నాం.. యూపీ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీకి దిగనుందని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులామ్ నబీ ఆజాద్ సహా పలువురు నేతల అభిప్రాయాల మేరకు వారి సమక్షంలోనే పొత్తు బంధాన్ని రద్దు చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరి దీనిపై ఎస్పీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu