సంజయ్ దత్ కు అండగా ఎస్పీ,ఎన్.సి.పి.

 

 

S.P., N.C.P. Backs Sanjay Dutt, Sanjay Dutt S.P., N.C.P., Sanjay Dutt Support S.P., N.C.P.,

 

 

సుప్రీంకోర్టు గురువారం సినీనటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలు శిక్ష విదిచిన విషయం విదితమే. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ జస్టీస్ మార్కండేయ కట్జు గవర్నర్ కె. శంకరనారాయణన్ కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద సంజయ్ దత్ కు క్షమాభిక్ష ప్రసాదించమని మార్కండేయ కట్జు లేఖలో పేర్కొన్నారు. 1993 లో బాంబు పేలుళ్ళతో సంజయ్ కు ఎలాంటి సంబంధం లేదని కేవలం అతని వద్ద లైసెన్స్ లేని నిషిద్ధ ఆయుధాలు కలిగి ఉన్నందునే టాడా కోర్టు అతనికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిందని కూడా పేర్కొన్నారు.

 

ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ లకు విజ్ఞప్తి చేస్తూ సంజయ్ దత్ కు ప్రత్యేక కేటగిరీలో అతనికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఎన్.సి.పి. నేత అధికార ప్రతినిధి డి.పి. త్రిపాఠి మాట్లాడుతూ కేవలం సంజయ్ దత్ వద్ద దొరికిన లైసెన్స్ లేని ఆయుధాల వల్లనే అతనికి ఇంతకుముందు జైలు శిక్ష పడిందని, సంజయ్ నిందుతుడని ఎక్కడా పేర్కొనలేదని కాబట్టి మార్కండేయ విజ్ఞప్తి చేసిన విధంగా సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతిని, మహారాష్ట్ర గవర్నర్ లను కోరారు.