ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు? బరిలో పురుంధరేశ్వరీ?
posted on Dec 4, 2015 9:24AM

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం విశాఖ ఎంపీ హరిబాబు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మరో నేత రానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నఎంపీ హరిబాబు తనకున్న పని ఒత్తిడి కారణంగా ఆ స్థానంలో మరెవరినైనా నియమించాలని బీజేపీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెల రెండోవారంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ అధ్యక్ష పదవి నియామకంలో ముఖ్యంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అవి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ తోపాటు ఎమ్మెల్సీ వీర్రాజు.. ఈ ముగ్గురిలో పురంధేశ్వరి, లక్ష్మినారాయణ మాత్రం ఎన్నికల టైంలోనే బీజేపీలో చేరారు.. కానీ వీర్రాజు మాత్రం అలా కాదు పార్టీకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నాడు.. అందులోనూ ఎక్కువ మంది సోము వీర్రాజు పేరునే వినిపిస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పగ్గాలు సోము వీర్రాజు చేతికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి ఎవరి చేతికి అధ్యక్ష పదవి పగ్గాలు అందుతాయో చూడాలి.