సోము వీర్రాజు వ్యాఖ్యలపై కామినేని అసహనం...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఒకపక్క కేంద్ర బడ్జెట్ విషయంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని అందరూ మొత్తుకుంటుంటే.. రాజుగారు మాత్రం సందర్భంలేకుండా మీడియా ముందుకు వచ్చి...  రెండెకరాల రైతునని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన.. ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. మిత్ర పక్షం గురించి ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. అంతర్గత సమావేశాల్లో తప్ప బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని తమ పార్టీ అధిష్ఠానం సూచన చేసిందని, దానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. మరి రాజుగారు పార్టీ ఆధిష్టానానికైనా భయపడతారో...లేక ఇలాగే రెచ్చిపోతారో చూద్దాం ఏం జరుగుతుందో...