ఘరానా మొగుడికి ఝలక్ ఇచ్చిన ఘరానా అల్లుడు

 

కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత ఆ కేసు గురించి కానీ, మళ్ళీ వారివురూ కలిసే ఆలోచనచేస్తున్నట్లు గానీ ఎక్కడా ప్రస్తావన ఎక్కడా రాలేదు. వారి కుమార్తె ‘నిర్వర్తిత’, శ్రీజ ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.

 

దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ ఈ మద్యనే బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశః ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డ్డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమయిన భారతీయజనతా పార్టీను ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరయితే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చును.

ఆయనకి అటువంటి ఆలోచన లేనట్లయితే, చార్టెడ్ ఎకౌంటెంట్ గా చాలా మంచి జీవితమే గడిపే అవకాశమే ఉంది. గానీ, వేరే ఆలోచనలు ఉన్నందునే ఆయన రాజకీయాలలోకి వచ్చిఉండవచ్చును. ఘరానా మొగుడికి ఘరానా అల్లుడు దొరికినట్లే కనిపిస్తోంది.