ఇక ఆ విషయంలో నో కాంప్రమైజ్‌

 

shinde telangana, telangana state shinde, united andhra pradesh telangana

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం పై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలి అన్నడిమాండ్‌ బలంగా వినిపిస్తుంది.. ఈ నేపధ్యంలో అలాంటి అవకాశం లేదని స్పంష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే.

 

ఆయన హోం శాఖ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలంగాణ నిర్ణయం పై కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయంపై పునరాలొచించేది లేదని స్పష్టం చేశారు.



కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్ర విభజనకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. అయితే ఈ 5వ తారీఖు నుంచి జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా చాలా సార్లు తెలంగాణ విషయం చర్చ జరిగినందున మరోసారి అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం పడక పోవచ్చు అన్నారు.