విభజన వ్యతిరేకిస్తూ షర్మిల బస్సుయాత్ర

Publish Date:Aug 30, 2013

Advertisement

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీమాంధ్ర జిల్లాల్లో బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రజానేత వైఎస్ఆర్ వర్థంతి కావడంతో ఆ రోజున కడప జిల్లాలోని వైఎస్ఆర్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో ఆమె ఈ యాత్ర చేయనున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాలలో ఆమె బస్సుయాత్రను కొనసాగిస్తారు.