శక్తిమాన్ విగ్రహ ఆవిష్కరణ...
posted on Jul 11, 2016 2:30PM

పోలీస్ అశ్వం శక్తిమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన తెలిపిన నేపథ్యంలో.. గణేష్ జోషి అనే భాజపా ఎమ్మెల్యే శక్తిమాన్ పై దాడి జరిపిన సంగతి విదితమే. ఆ దాడిలో శక్తిమాన్ కాలు విరిగిపోగా.. దాని కోసం విదేశాల నుండి కృత్రిమ కాలు తెప్పించారు. ఆపరేషన్ చేసి కృత్రిమ కాలు అమర్చారు. అయితే కొన్నిరోజులు బాగానే ఉండి.. ఇంకా కోలుకుంటుంది అనే లోపులోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇప్పుడు శక్తిమాన్ గుర్తుగా ఓ విగ్రహాన్ని తయారు చేయించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ డెహ్రాడూన్ పోలీస్ లైన్‌లో శక్తిమాన్ విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 20న శక్తిమాన్ కన్నుమూసింది.